Breaking News

రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు

Published on Wed, 11/22/2023 - 18:22

దిగ్గజ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్‌ కాబట్టి దాని ట్యాక్స్‌స్లాబ్‌కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్‌లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్‌ల ప్లాట్‌ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)