Breaking News

వాళ్లు నిజమైన ధనవంతులు కారు!!

Published on Sun, 11/09/2025 - 13:59

ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత విజయం సాధించాడన్నది ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. వారి విలాసవంతమైన జీవనశైలి, వాడే లగ్జరీ వస్తువులు, సోషల్ మీడియా హోదాతో కొలుస్తారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ మాత్రం సంపదకు కొత్త నిర్వచనాన్ని చెబుతున్నారు. సంపదను ప్రదర్శించేవారు నిజమైన ధనవంతులు కారు అంటున్నారాయన.

‘నిజమైన సంపద అంటే మనశ్శాంతి. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు’ అంటూ తన అభిప్రాయాలను ‘ఎక్స్‌’ పోస్ట్‌లో వెల్లడించారు. కౌశిక్ అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక ఆరోగ్యాన్ని మన దగ్గర ఉన్న డబ్బు ద్వారా కాకుండా, ఆ డబ్బు మనకు ఇచ్చే శాంతి, స్వేచ్ఛ ద్వారా కొలవాలి.

‘మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే, బ్యాంకులో రూ.50 లక్షలు ఉన్నా వ్యర్థం’ అని రాసుకొచ్చారు. బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి ఆర్థిక అలవాట్లు దురాశతో కాకుండా స్వేచ్ఛ కోసం అలవరుచుకోవాలని గుర్తుచేశారు. కౌశిక్ దృష్టిలో "ఆర్థిక స్వేచ్ఛ = మానసిక స్వేచ్ఛ". అంటే సంపద నిర్వహణ అంతిమ లక్ష్యం శాంతియుతమైన, సురక్షితమైన మనస్సు. అంతే కానీ బయటకు ప్రదర్శించేది కాదు.

ఆర్థిక పరిణతి అంటే..

“ఆర్థికంగా పరిణతి చెందిన అలవాట్లు” గురించి మరొక పోస్ట్‌లో కౌశిక్ వివరించారు. నిజమైన సంపద ఆదాయం లేదా ఆస్తులను మించి ఉందని, “ధనవంతులను నిర్వచించేది డబ్బు కాదు.. దానిని వాళ్లు ఎలా తీసుకువెళ్తారన్నదే” అని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, దీర్ఘదృష్టి.. ఇవే ఆర్థిక పరిణతి అసలైన లక్షణాలు అని వివరించారు.

ఆర్థికంగా పరిణతి చెందిన వ్యక్తుల అలవాట్లు

  • తమ ఆర్థిక విజయాలను ప్రదర్శించరు. నిజమైన ఇన్వెస్టర్లు (ధనవంతులు) తమ గురించి చెప్పుకోరు. అంటే, వృద్ధికి ప్రజా గుర్తింపు అవసరం లేదు.

  • తమ ఆర్థిక ప్రమాణాలను సమర్థించుకోరు. “పేలవమైన డబ్బు అలవాట్లకు నో చెప్పినందుకు మీరు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.”

  • విలాసాన్ని చూపించరు. “నిజమైన సంపద శాంతిని తెస్తుంది. అందరి దృష్టిని కాదు” నిజమైన ఆర్థిక భద్రత తక్కువ ప్రదర్శనలోనే ఉంటుంది.

  • మార్కెట్ గోలను పట్టించుకోరు. “ఆ డ్రామా (మార్కెట్‌ హడావుడి) నుండి దూరంగా ఉండటం దృష్టిని, పోర్ట్‌ఫోలియో రాబడిని రక్షిస్తుంది” తద్వారా భావోద్వేగ స్థిరత్వాన్ని పొందుతారు.

  • ధ్రువీకరణ కోసం వెతుక్కోరు. “ఉనికి, స్థిరత్వం, సహనం.. ఇవి బ్యాలెన్స్ షీట్ కంటే గొప్పవి” నిశ్శబ్ద పట్టుదల వారికి బలాన్ని ఇస్తుంది.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)