Breaking News

ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్‌

Published on Mon, 01/06/2025 - 21:00

బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్‌ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.

కోవిడ్‌ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం  ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.

ఇది ఎలా పని చేస్తుందంటే..
చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్‌ అందుకోవచ్చు.

ఆధార్ కార్డు తప్పనిసరి
పీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • పీఎం స్వనిధి వెబ్‌సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.

  • మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.

  • ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.

  • ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరి వడ్డీ రేటు 
ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్‌ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)