Breaking News

టాటా కార్ల కొనుగోలుపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్ - ఏ కారుపై ఎంతంటే?

Published on Mon, 06/12/2023 - 14:01

Discounts: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి కార్లు ఉన్నాయి. అయితే సంస్థ టాటా పంచ్ మరియు నెక్సాన్ కార్ల మీద ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు. కాగా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా టియాగో (Tata Tiago)
భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యాచ్‌బ్యాక్స్ లో ఒకటైన టియాగో మీద కంపెనీ రూ. 43000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. కావున వేరియంట్‌ని బట్టి డిస్కౌంట్ మారుతుంది. టియాగో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, రూ. 20000 వరకు కంజ్యుమర్ స్కీమ్ కింద తగ్గింపు లభిస్తుంది. 

ఇక CNG వేరియంట్ మీద 43000 తగ్గింపు లభించగా.. ఇందులో కంజ్యుమర్ స్కీమ్ కింద రూ. 30 వేలు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్, ఇగ్నీస్, గ్రాండ్ ఐ వంటి వాటికి ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టిగోర్ (Tata Tigor)
టాటా మోటార్స్ ఇప్పుడు టిగోర్ పెట్రోల్ మోడల్ మీద రూ. 33,000 తగ్గింపుని సిఎన్‌జీ మోడల్ మీద రూ. 48000 తగ్గింపుని ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ మీద ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్, కంజ్యుమర్ స్కీమ్ లభించే డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ తగ్గింపులు కూడా లభిస్తాయి.

(ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?)

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
టాటా ఆల్ట్రోజ్ మీద ఇప్పుడు రూ. 30000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. ఈ తగ్గింపులు కేవలం పెట్రోల్, డీజిల్ మోడల్స్‌కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సిఎన్‌జీ మోడల్ మీద మాత్రం ఎటువంటి తగ్గింపులు లభించవు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు, డీజిల్ మోడల్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది.

(ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!)

టాటా హారియర్ & సఫారి (Tata Harrier and Safari)
టాటా హారియర్ & సఫారి కార్ల కొనుగోలుపైన రూ. 35000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు SUVల మీద రూ. 25,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో కార్పొరేట్ తగ్గింపు కింద రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు మోడల్స్ మీద ఎటువంటి కంజ్యుమర్ బెనిఫిట్స్ లభించవు.

"డిస్కౌంట్‌లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించండి.''

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)