రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్

Published on Thu, 04/10/2025 - 09:25

భారతదేశంలో ఖరీదైన లంబోర్ఘిని కార్లను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది. ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సరికొత్త ఉరుస్ పెర్ఫార్మాంటే కొనుగోలు చేశారు. కాగా ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేశారు.

లంబోర్గిని ఉరుస్ కొనుగోలు చేసిన వేణు గోపాలకృష్ణన్.. మోటారు వాహనాల శాఖ (MVD) నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో KL07 DG 0007 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 45.99 లక్షల రూపాయలు వెచ్చించారు. కేరళలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నోటిఫైడ్ ఫ్యాన్సీ వెహికల్ నెంబర్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.

వేణు గోపాలకృష్ణన్ కొనుగోలు చేసిన లంబోర్గిని ఉరుస్ ధర రూ. 4 కోట్లు. దీనిని ఆయన బెంగళూరులోని లంబోర్గిని డీలర్‌షిప్‌ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: Delhi EV Policy 2.0: పెట్రోల్ బైకులు, సీఎన్‌జీ ఆటోలు బ్యాన్!

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని భారతదేశంలోని పరిమిత నగరాల్లో మాత్రమే డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అతను బహుశా SUVని బుక్ చేసుకుని, ముందుగానే అన్ని కస్టమైజేషన్‌లను చేసి ఉండవచ్చు. ఈ వీడియోలో యజమాని, అతని కుటుంబం డెలివరీ తీసుకోవడానికి డీలర్‌షిప్‌ను సందర్శించారు.

లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే 4.0 లీటర్, ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 666 పీఎస్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు.. మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)