Breaking News

టిక్‌టాక్‌ యాప్ ఉన్న ఫోన్ రూ.43 కోట్లు?

Published on Sat, 01/25/2025 - 14:05

భారతదేశంలో టిక్‌టాక్‌(TikTok)ను పూర్తిగా నిషేధించినప్పటికీ.. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ చైనా యాప్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఇటీవల అమెరికా దీనిపై నిషేధం విధించింది. దీంతో చాలామంది యూజర్లు.. ఇకపై టిక్‌టాక్‌ ఉండదని, యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మళ్ళీ వారు ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. కాగా ఈ యాప్ ఉన్న ఫోన్‌ల ధరలు యూఎస్ఏలో భారీగా పెరిగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. టిక్‌టాక్‌ యాప్ ఉన్న 'ఐఫోన్ 15 ప్రో 125 జీబీ' మోడల్ ధర 5 మిలియన్ డాలర్లు (రూ. 43కోట్లు) అని తెలుస్తోంది.

నేను టిక్‌టాక్‌ తొలగించాను.. ఇప్పుడు దానిని ఇన్‌స్టాల్ చేయలేకపోతున్నాను. టిక్‌టాక్‌ యాప్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నవాళ్లు.. ఎవరైనా విక్రయించదలిస్తే.. వారికి 5000 డాలర్లు (రూ. 4.3 లక్షలు) ఇస్తాను అని ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూస్తుంటే.. అమెరికా ప్రజలు టిక్‌టాక్‌కు ఎంతగా అలవాటు పడ్డారో అర్థమవుతోంది. ఈ ఒక్క యాప్ ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు.

ఇదీ చదవండి: ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి

నిజానికి జనవరి 19న టిక్‌టాక్‌ నిషేధం అమల్లోకి వచ్చింది. కానీ 12 గంటల్లోనే ఆ నిషేధం ఎత్తివేశారు. అప్పటికే ఈ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నవారు.. మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత యూఎస్ చట్టపరమైన కారణాల కారణంగా డౌన్‌లోడ్ కావడం లేదు. దీంతో మళ్ళీ టిక్‌టాక్‌ పొందటానికి.. యాప్ ఉన్న మొబైల్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)