Breaking News

టెస్ట్ డ్రైవ్‌లో రూ.33 లక్షల కారు నుజ్జునుజ్జు - వీడియో వైరల్

Published on Tue, 09/12/2023 - 12:17

సాధారణంగా ఒక కారు కొనడటానికి ముందు కంపెనీ డీలర్‌షిప్ టెస్ట్ డ్రైవ్ సదుపాయం కల్పిస్తుంది. అయితే కొన్ని సార్లు అనుభవం లేని డ్రైవర్లు కారుని డ్రైవ్ చేస్తే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం ఈ సంఘటన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీలో జరిగినట్లు తెలుస్తోంది. అమెరికన్ కార్ బ్రాండ్ అయిన జీప్ మెరిడియన్ టెస్ట్ డ్రైవ్ సమయంలో అనుకోని పెద్ద ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు.

ఈ వీడియోలో గమనించినట్లయితే, రోడ్డు తడిగా ఉండటం గమనించవచ్చు. ప్రమాదం జరగటానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు. దీనికి కారణం అతి వేగమా? లేక డ్రైవింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడమా? అనేది తెలియాలి ఉంది. అయితే ప్రమాదంలో కారు చాలా ఎక్కువ దెబ్బతినడంతో ఫ్రంట్ బంపర్, రియర్ ప్రొఫైల్ చాలా వరకు పనికిరాకుండా పోయింది.

కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండు స్ట్రీట్‌లైట్‌ స్తంభాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. లోపల ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడం వల్ల బహుశా వారికి గాయాలేమైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా?

జీప్ మెరిడియన్..
టెస్ట్ డ్రైవ్ సమయంలో వినియోగదారుడు పరిమిత వేగంతో డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కొత్త కారు గురించి వారికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. కారు ప్రమాదానికి గురైతే టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకున్న వారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగిందా? లేదా స్పష్టంగా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన జీప్ మెరిడియన్ ధర రూ. 33.41 లక్షల నుంచి  రూ. 38.61 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదం ఇదే మొదటి సారి కాదు..
టెస్ట్ డ్రైవ్ సమయంలో కార్లు ప్రమాదానికి గురవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా, టాటా కంపెనీకి చెందిన కార్లు, హ్యుందాయ్ ఐ20 ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం సాధారణ కార్లు మాత్రమే కాకుండా టెస్లా కార్లు కూడా టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)