నెలకు రూ.3 లక్షల జీతం.. నిద్రకూ టైమ్ లేదు!

Published on Thu, 07/30/2026 - 11:57

నెల తిరిగేసరికి ఖాతాలో రూ.3 లక్షల వేతనం జమవుతోంది.. సమాజంలో మంచి గుర్తింపు, ఆకర్షణీయమైన కెరీర్.. కానీ, ప్రశాంతంగా నిద్రపోయేందుకు సమయం లేదు. రోజుకు 15-16 గంటల పాటు నిరంతరాయంగా కంప్యూటర్ స్క్రీన్ల ముందే జీవితం కరిగిపోతోంది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పంచుకున్న ఈ చేదు నిజం ఇప్పుడు అటు కార్పొరేట్ రంగాన్ని, ఇటు సామాజిక వర్గాలను ఆలోచింపజేస్తోంది.

సామాజిక మాధ్యమం ‘రెడ్డిట్’ వేదికగా ఆ యువకుడు పంచుకున్న ఆవేదన నేటి ఐటీ రంగంలో విస్తరిస్తున్న టాక్సిక్ వర్క్ కల్చర్ (విషపూరితమైన పని సంస్కృతి), లైఫ్-వర్క్ ఇంబ్యాలెన్స్‌ను స్పష్టంగా ఎత్తిచూపుతోంది. రోజువారీ పనిభారంతో శారీరకంగా, మానసికంగా తీవ్రమైన అలసటకు (బర్న్‌ఔట్) గురవుతున్నానని చెప్పాడు. అసలు జీవితం ఎటు వైపు వెళ్తుందో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రాజెక్ట్ డెడ్‌లైన్లు, విపరీతమైన పని ఒత్తిడితో వ్యక్తిగత జీవితం పూర్తిగా శూన్యమైపోయిందని సదరు టెక్కీ వాపోయాడు.

జీతం ఎక్కువే.. శ్రమా ఎక్కువే!

అధిక వేతనాలు చెల్లిస్తున్నామనే సాకుతో ఉద్యోగుల నుంచి 15-16 గంటల శ్రమను పిండుకోవడం ఐటీ సంస్కృతిలో భాగమైపోతోంది. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు డిప్రెషన్ వంటి మానసిక ఒత్తిళ్లు యువతను కుంగదీస్తున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఇది.

చట్టబద్ధమైన హద్దులు ఏవి?

పని గంటల నియంత్రణ, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన బాధ్యత కంపెనీలపై ఎంతో ఉంది. నాణ్యమైన పని పొందాలంటే ఉద్యోగికి తగినంత విశ్రాంతి, వ్యక్తిగత సమయం లభించడం అత్యంత ఆవశ్యకం. పని చేయడానికి బతుకుతున్నామా? లేక బతకడానికి పని చేస్తున్నామా? అనే ప్రాథమిక సూత్రాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు గుర్తుంచుకోవాలని కొందరు చెబుతున్నారు. రూపాయి నాణేనికి ఒకవైపు మెరిసే జీతాలు కనిపిస్తున్నా రెండో వైపు నలిగిపోతున్న ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం అంధకారంలోకి వెళ్తుంది. మానవ వనరులను కేవలం యంత్రాలుగా కాకుండా మనుషులుగా చూసే శ్రమ సంస్కృతి వైపు పరిశ్రమ అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)