Breaking News

ఇదో పిచ్చి.. రూ. 3 కోట్ల కారు నాశనం చేశాడు: షాకింగ్‌ వీడియో!

Published on Wed, 03/01/2023 - 10:46

న్యూఢిల్లీ: కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారును కళ్లముందే ధ్వంసం చేసిన వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. లిట్ ఎనర్జీ డ్రింక్‌ ప్రమోషన్‌లో భాగంగా లంబోర్ఘిని ఉరస్‌ను ఒక రష్యన్‌ యూ ట్యూబర్ ముక్కలు చేసి పారేశాడు. దీంతో వీడియో వైరల్‌గా గారింది.  రూ. 3 కోట్లకు పైగా విలువైన లంబోర్ఘిని కారును నాశనం చేయడం నెటిజన్లని షాక్‌కి గురి చేసింది.  (మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌ ? షాకింగ్‌ వీడియో వైరల్‌)

వివరాల్లోకి వెళితే మిఖాయిల్ లిట్విన్ అనే పాపులర్‌ రష్యన్ యూట్యూబర్ లిట్‌ ఎనర్జీ డ్రింక్‌ ప్రమోషన్‌ కోసం తన వైట్‌ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఉరుస్‌ కారును కేవలం కొన్ని సెకన్లలో ధ్వంసం  చేసి, ఆ వీడియో షేర్‌ చేశాడు. ఒక భారీ క్రేన్‌తో లంబోర్ఘిని కారుపై పడేసి, తద్వారా లిట్‌ డ్రింక్‌ చిందేలా చేయడం ఇంటర్నెట్ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  కేవలం ఎనర్జీ డ్రింక్‌ ప్రకటన కోసం రూ. 3.15 కోట్ల (ఎక్స్-షోరూమ్)  ఖరీదైన ఎస్‌యూవీని యూట్యూబర్ ముక్కలు చేయడంపై నెటిజన్లు పలు  అనుమానాల్ని వ్యక్తం చేశారు. స్టంట్‌పై స్పందించిన ఒక యూజర్‌ బీమా కంపెనీ పరిస్థితి ఏంటి ఒకరు వ్యాఖ్యానించారు. పాపులారిటీ కోసం యూట్యూబర్లు ఇదంతా చేస్తున్నారని కొంతమంది మండి పడ్డారు. అనవసరంగా ఇంత పొల్యూషన్‌ సృష్టించడం నేరమని కొందరు  లైక్స్‌ అండ్‌ వ్యూస్‌ కోసం చేస్తున్న ఫక్తు బిజినెస్‌ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా మహీంద్రా స్కార్పియోఎన్ రూఫ్‌ టాప్‌ లీక్‌ అవుతున్న వీడియోను ఒక యూట్యూబర్‌ షేర్‌ చేసిన క్లిప్ కూడా ఇంటర్నెట్‌లో తెగ  వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో యూట్యూబ్‌ క్రియేటర్‌లు ఇలాంటి వైరల్ కంటెంట్‌ను  తయారు చేయడంలో ఆరితేరిపోయారనే నవిమర్శలు  వినిపిస్తున్నాయి.


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)