ఒంటిపై చొక్కాలేదు.. కానీ రూ.100 కోట్ల సంపద!

Published on Fri, 07/24/2026 - 20:03

ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కర్ణాటకలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న పాత షేర్ పెట్టుబడుల గురించి చెప్పడం నెటిజన్లలో ఆసక్తిని పెంచింది.

వైరల్ వీడియోలో ఓ వ్లాగర్.. ఆ వృద్ధుడిని ఆయన పెట్టుబడుల గురించి అడుగుతాడు. అందుకు సమాధానంగా తన వద్ద లార్సన్ అండ్ టూబ్రో (L&T) కంపెనీకి చెందిన 27 వేల షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌కు చెందిన 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌కు చెందిన 4 వేల షేర్లు ఉన్నాయని చెబుతారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రతి సంవత్సరం తనకు సుమారు రూ.6.5 లక్షల వరకు డివిడెండ్ వస్తుందని, ఆ ఆదాయంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నానని తెలిపారు.

ఈ వీడియోలో అందరినీ ఆకట్టుకున్న విషయం.. ఆయన పెట్టుబడుల కంటే ఆయన సరళమైన జీవనశైలి. సాధారణ దుస్తులు ధరించి, గ్రామీణ వాతావరణంలో ఎంతో సాదాసీదాగా కనిపించిన ఆ వ్యక్తి తన ఆర్థిక స్థితి గురించి చాలా సాధారణంగా మాట్లాడారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆడంబరం లేకుండా జీవించడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో వైరల్ అయిన తర్వాత, కొంతమంది ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఆయన షేర్ల విలువను అంచనా వేశారు. వారి లెక్కల ప్రకారం.. ఎల్ అండ్ టీ షేర్ల విలువ సుమారు రూ.80 కోట్లు, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ల విలువ దాదాపు రూ.21 కోట్లు, కర్ణాటక బ్యాంక్ షేర్ల విలువ సుమారు రూ.1 కోటి వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అయితే.. ఇవి కేవలం సోషల్ మీడియా అంచనాలు మాత్రమే, షేర్ల విలువ ఎంత అనేది అధికారికంగా వెల్లడికాలేదు. నిజానికి ఈ వీడియో దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు చూపించింది. మంచి కంపెనీల్లో సరైన సమయంలో పెట్టుబడి పెట్టి, వాటిని కొన్నేళ్లు కొనసాగిస్తే సంపదను సృష్టించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంపద అనేది కేవలం ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్లు, విలాసవంతమైన జీవనశైలిలో మాత్రమే కనిపించదని, సాధారణంగా జీవించే వ్యక్తుల వద్ద కూడా భారీ ఆస్తులు ఉండొచ్చని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)