Breaking News

రూ. లక్ష.. కోటి రూపాయలైంది..!

Published on Fri, 09/12/2025 - 11:53

స్టాక్‌ మార్కెట్‌లో రిస్క్‌ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్‌ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.

ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర  2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది.  అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్‌ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్‌ది. 2025 జూన్ 30 నాటికి ఈ  కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.

ఒలెక్ట్రా గురించి.. 
గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ బస్‌ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్‌2, టైర్‌3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్‌ బస్‌ రంగంలో 25 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీదే.

2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది.  2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం  2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.)

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)