Breaking News

వచ్చేస్తోంది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - వీడియో చూశారా?

Published on Thu, 10/17/2024 - 21:18

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.

కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.

ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్‌ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్, మోనోషాక్‌ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)