Breaking News

థాయ్‌లాండ్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌

Published on Thu, 12/05/2024 - 07:46

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా థాయ్‌లాండ్‌లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్‌ మోటార్స్‌ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్‌ చేస్తారు.

‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్‌లాండ్‌ అసెంబ్లీ ప్లాంట్‌ ఈ విజన్‌ను అందిస్తుంది’ అని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈవో బి.గోవిందరాజన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఇప్పటికే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ఇటువంటి అసెంబ్లింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్‌లాండ్‌లో మిడ్‌–సెగ్మెంట్‌ మార్కెట్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీసీవో యద్వీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు.

అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్‌ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్‌ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్‌లాండ్‌ మార్కెట్‌తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)