Breaking News

అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బండి

Published on Sun, 11/24/2024 - 13:50

అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్‌ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్‌ చేసింది. అలనాటి బాబర్ మోటార్‌సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్‌కు అప్‌డేట్‌ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్‌ 2024 ఈవెంట్‌లో ఈ బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్‌ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్‌ స్కీమ్‌లలో లభిస్తుంది.

కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్‌కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్‌ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్‌ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.

క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఫైవ్‌-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్‌పీ, 27 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)