Breaking News

భారత్‌లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు

Published on Sat, 02/14/2026 - 09:14

ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్‌లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.

ప్రకటనలోని అంశాలు..

భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్‌ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్‌ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.

వికసిత్ భారత్ దిశగా అడుగులు

ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.

ఉపాధి, ఆర్థిక వృద్ధి

ఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్‌లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్‌ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)