Breaking News

టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Published on Tue, 04/21/2026 - 09:04

ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వేతన జీవి పోరాటం అంతా ఆ నాలుగు మెతుకుల కోసమే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. అంతర్జాతీయంగా ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన కర్రీ పాయింట్లలో కరీ ప్యాకెట్ ధర పెరుగుతుంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకితే రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ ధర మారుతుంది. ధరలు పెరిగిన ప్రతిసారీ సర్దుకుపోవడం సామాన్యుడికి అలవాటైపోయింది. కానీ ఆ సర్దుబాటు ఇప్పుడు అతని ఆకలిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.

వ్యాపారులకు ఖర్చులు పెరిగాయన్నది నిజమే కావచ్చు, కానీ పరిస్థితులు చక్కబడ్డాక పెంచిన రేట్లను తగ్గించే మనసు మాత్రం ఏ వ్యాపారికీ రాదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక పక్క కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకులు చెబుతూ ఉద్యోగి జీతంలో వందల రూపాయల పెంపునకు కూడా వెనకాడుతుంటే.. అదే కంపెనీల యజమానులు మాత్రం కుబేరుల జాబితాలో పోటీ పడుతున్నారు. ఈ అంతరం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అశాంతికి పునాది.

ఆకాశమే హద్దుగా ధరలు

ఒకప్పుడు రూ.20 ఉన్న కర్రీ ప్యాకెట్ నేడు రూ.30కి(కొన్ని ప్రదేశాల్లో మారుతుంటుంది) చేరింది. అంటే ఒక్కసారిగా 50 శాతం పెరుగుదల. కేవలం కర్రీ పాయింట్లే కాదు, టిఫిన్ సెంటర్లలో రూ.30 ఉండే ప్లేట్ ఇడ్లీ నేడు రూ.45కి చేరింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో ఈ ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ అటు బడా హోటళ్లు, ఇటు వీధి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.

అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, ముడి చమురు లేదా గ్యాస్ ధరలు తగ్గినా.. పెంచిన ఈ ధరలను మళ్లీ తగ్గించడం అనేది మన మార్కెట్ సంస్కృతిలో దాదాపు అసాధ్యం.

పెరగని జీతాలు.. కార్పొరేట్ లాభాలు

వస్తువుల తయారీ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని సాకు చూపుతున్న కంపెనీలు ధరల భారమంతా వినియోగదారుడిపైనే మోపుతున్నాయి. కానీ, అదే నిష్పత్తిలో తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వార్షికంగా ధరల పెరుగుదల 30-50 శాతం ఉంటే సగటు వేతన జీవి జీతాల పెరుగుదల మాత్రం 5 నుంచి 8 శాతం లోపే ఉంటోంది. మరోవైపు, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని వాపోతున్న కంపెనీల యజమానులు మాత్రం ఫోర్బ్స్ వంటి ప్రపంచ ధనవంతుల జాబితాలో తమ ర్యాంకులను మెరుగుపరుచుకుంటున్నారు.

సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై అధిక శాతం ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతుంటే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.

పరిష్కార మార్గాలు

ప్రభుత్వాలు చేయాల్సినవి..

ధరల నియంత్రణ కమిటీలు: నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గినా ధరలు తగ్గించని సిండికేట్లపై చర్యలు తీసుకోవాలి.

వేతన సవరణ చట్టం: కేవలం కనిష్ట వేతనం మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేటు రంగంలోనూ కనీస వార్షిక ఇంక్రిమెంట్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలి.

ప్రజా రవాణా పటిష్ఠం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మరో ప్రధానాంశం రవాణా. ప్రజారవాణాను చౌకగా అందుబాటులోకి తెస్తే కొంత ఊరట లభిస్తుంది.

ప్రజలు చేయాల్సినవి..

ఆర్థిక క్రమశిక్షణ: అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సంస్కృతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

నైపుణ్యాభివృద్ధి: మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం జీతంపైనే ఆధారపడకుండా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.

వినియోగదారుల హక్కులు: అన్యాయంగా ధరలు పెంచే వ్యాపార సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి వినియోగదారుల ఫోరమ్ ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి.

అభివృద్ధి అంటే కేవలం జీడీపీ అంకెలు పెరగడం కాదు.. సగటు సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగడం. సంపద పంపిణీలో సమతుల్యత లేకపోతే అది దేశ పురోగతికి ఆటంకమవుతుంది. ఇప్పటికైనా పాలకులు, పారిశ్రామికవేత్తలు సామాన్యుడి బతుకు బండిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

Videos

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు

Photos

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)