Breaking News

‘ఆమె’ అప్పు పెంచింది!

Published on Wed, 09/02/2026 - 14:37

భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన 2026 జూన్ త్రైమాసిక నివేదిక ప్రకారం, బ్యాంకు రుణాలను పొందడంలో మహిళలు ముందుంజలో ఉన్నారు. జూన్ 2026 నాటికి మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు అందించిన అప్పు గత ఏడాదితో పోలిస్తే 19.7 శాతం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జూన్‌లో ఈ వృద్ధి 12.9 శాతంగా ఉండగా ఈసారి గణనీయంగా పుంజుకోవడం విశేషం.

రుణ రంగంలో సమగ్ర పురోగతి

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం బ్యాంక్ రుణ వృద్ధి 16.5 శాతంగా నమోదు కాగా, మహిళా రుణగ్రహీతల వృద్ధి రేటు (19.7%) అంతకంటే అధికంగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లు తగ్గడం కూడా రుణాలు పెరగడానికి ప్రధాన కారణమైంది. బ్యాంకుల బకాయి రుణాలపై సగటు వడ్డీ రేటు గతేడాది 9.71 శాతం నుంచి 9.26 శాతానికి దిగివచ్చింది. 9 శాతం కంటే తక్కువ వడ్డీకే లభించే రుణాల వాటా 54.1 శాతం నుంచి ఏకంగా 64.1 శాతానికి చేరింది.

గ్రామీణ, చిన్న పట్టణాల ఆధిపత్యం

మెట్రో నగరాల కంటే కూడా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ వేగంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 21.1% వృద్ధి, అర్బన్/సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 21.4% నుంచి 21.6% వృద్ధి, మెట్రోపాలిటన్ నగరాల్లో 13.1% వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు కేవలం సాధారణ వ్యక్తిగత రుణాలకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార వేత్తలుగా నిలదొక్కుకోవడానికి నిధి సదుపాయాలను వినియోగించుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు 18 శాతం చొప్పున పెరగడం దేశీయ ఆర్థిక రంగంలో స్థిరమైన పురోగతికి సంకేతం.

ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ!

#

Tags : 1

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)