Breaking News

గ్రీన్‌ గోదాంలకే డిమాండ్‌.. ఈ ఏడాది భారీ లీజులు!

Published on Sat, 02/07/2026 - 13:31

భవనాలే కాదు గిడ్డంగులు కూడా హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. తక్కువ విద్యుత్‌ వినియోగం, నీరు, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్‌ వంటి సౌకర్యాలు ఉండే గ్రీన్‌ గిడ్డంగులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సమర్థవంతమైన ఇంధన వినియోగం, వ్యర్థాలు, కార్బన్‌ ఉద్గారాలు తగ్గించే పర్యావరణ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సొల్యూషన్, స్మార్ట్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, తాపన/శీతలీకరణ అవసరాలను తగ్గించేందుకు మెరుగైన ఇన్సులేషన్, సహజ కాంతి, వెంటిలేషన్‌ను వినియోగించే వీలు కల్పించే నిర్మాణ సామగ్రి, డిజైన్‌లను ఉపయోగించడం వంటి స్థిరమైన, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే గిడ్డంగులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్‌జీ)లకు ప్రాధాన్యత ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాపర్టీగా గ్రీన్‌ గిడ్డంగులు ఆకర్షణగా నిలుస్తాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.     – సాక్షి, సిటీబ్యూరో

పెరిగిన దేశీయ వినియోగం, మెరుగైన స్థూల ఆర్థిక స్థిరత్వం, సులువైన రుణ ప్రక్రియలతో ఈ ఏడాది గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ రంగంలో డిమాండ్‌ అధికమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం వార్షిక శోషణ 4–4.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుంది. మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడంతో ఈ రంగం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.

పట్టణాల్లోనూ.. 
తయారీ ఆధారిత డిమాండ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్‌ఐ) పథకాలు, చైనా+1 వ్యూహం వంటి చొరవలతో ఈ రంగానికి మద్దతు లభిస్తుంది. దీంతో పెద్ద ఫార్మాట్, గ్రేడ్‌–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక సౌకర్యాలకు ఆదరణ పెరుగుతుంది. మరోవైపు ఈ–కామర్స్‌ వినియోగం పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూముల ధరలు ఉండటం, వేగవంతమైన నిర్మాణ అనుమతులు తదితర కారణాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ రంగానికి కీలక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.

హైదరాబాద్‌లో.. 
గత ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.87 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం లీజుకు పోయింది. 2024లో జరిగిన 4.49 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. బెంగళూరు, చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వేర్‌హౌస్‌ లీజులు క్షీణించాయి. 2025లో అత్యధికంగా ముంబైలో 1.52 కోట్ల చ.అ. వేర్‌హౌస్‌ స్థలం లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో 22 లక్షల చ.అ. స్పేస్‌ లీజుకు పోయింది. 2024లో నగరంలో 32 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే ఏడాదిలో ఏకంగా 31 శాతం లావాదేవీలు తగ్గాయి. దేశీయ స్థాయిలో గిడ్డంగుల లావాదేవీలలో నగరం వాటా 2024లో 7 శాతంగా ఉండగా.. 2025 నాటికి 6 శాతానికి తగ్గింది. లీజు కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ నగరంలో గిడ్డంగుల అద్దెలు మాత్రం ఏడాదిలో 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.20.8గా ఉంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)