Breaking News

మాజీ ఉద్యోగులపై కోర్టు మెట్లెక్కిన విప్రో..రిషద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 01/20/2024 - 13:08

విప్రో మాజీ ఉన్నతస్థాయి ఉద్యోగుల తీరును తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించడంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పందించారు. మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రిషద్‌ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రో ఉద్యోగులు వారు చేస్తున్న పనిలో గోప్యత పాటించడం అవసరం. ఆ గోప్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలకు తావులేదని చెప్పారు.  

మా ఉద్దేశం అదికాదు.. వేరే ఉంది
వ్యాజ్యాలు ఉద్యోగుల ఉపాధిపై దెబ్బకొట్టేందుకు కాదని, కేవలం వారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నవంబర్‌లో, విప్రోలో సీఎఫ్‌ఓగా పనిచేసిన జతిన్‌ దలాల్‌పై దావా వేసింది. అతను విప్రోలో సీఎఫ్‌ఓగా పనిచేసిన వెనువెంటనే కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌ఓగా చేరారు. తద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించింది.  

అందరిది ఒకే మాట
క్యూ3 ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్‌జీ సీఈఓ థియరీ డెలాపోర్టే గతంలో ప్రస్తావించిన అంశంపై మాట్లాడారు. కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్‌పై వ్యాజ్యాలు దాఖలు చేయడం కంపెనీ కాంట్రాక్టు ఉల్లంఘించినందుకే తప్పా ఇందులో  వ్యక్తిగత అంశాలకు చోటులేదని చెప్పారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రిషద్‌ ప్రస్తావించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)