Breaking News

ఆహ్లాదకర వాతావరణం.. ల్యాండ్‌ స్కేపింగ్‌ అనివార్యం!

Published on Sun, 03/15/2026 - 09:21

వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్‌ స్కేపింగ్‌ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్‌ కమ్యూనిటీలోనే ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు.

పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కలుషితమవుతుంది. దీంతో సేంద్రీయ, సస్టయినబుల్‌ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. సువాసన, ఆకర్షణీయమైన పూలమొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్‌వేలు, డెక్‌లు, టెర్రస్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్‌ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్‌ ఈవెంట్లు, పార్టీలు చేసుకునేందుకు అనువైన వేదికగా ఉంటుంది.

క్లబ్‌హౌస్‌లో కో-వర్కింగ్‌ ప్లేస్‌
కరోనాతో మొదలైన వర్క్‌ ఫ్రం హోమ్‌ అక్కడక్కడా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే 
ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్‌ ఆఫీస్‌ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు.

ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్‌ స్పేస్‌ ఇస్తే ఇష్టపడటం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్‌ స్పేస్, హై నెట్‌వర్క్‌ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అంతా కలిసి ఒకే చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైగా అవసరమైనప్పుడు వెంటనే ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది.   

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)