Breaking News

సీఆర్‌పీఎఫ్‌కు రైఫిల్స్‌ సరఫరా

Published on Wed, 09/24/2025 - 08:34

కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు రెండు వందల సీఎస్‌ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును ఐకామ్‌-కారకాల్‌ దక్కించుకుంది. వీటిని హైదరాబాద్‌లోని ప్లాంటులో తయారు చేయనుంది. దేశీయంగా తొలిసారిగా ఉత్పత్తి చేసిన ఈ రైఫిల్‌ను ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో అందించనుంది.

భారత్‌–యూఏఈ రక్షణ రంగ సహకారానికి సంబంధించి ఈ తరహా చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఒక కీలక పరిణామం అని కారకల్‌ సీఈవో హమద్‌ అలమెరి తెలిపారు. దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న తమ దీర్ఘకాలిక వ్యూహానికి ఈ కాంట్రాక్టు దోహదపడుతుందని ఐకామ్‌ టెలీ డైరెక్టర్‌ సుమంత్‌ పాతూరు వివరించారు.

చిన్న ఆయుధాల తయారీ సాంకేతికత కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన ఎడ్జ్‌ గ్రూప్‌ సంస్థ కారకాల్‌ ఇంటర్నేషనల్‌తో మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ సంస్థ ఐకామ్‌కి ఒప్పందం ఉంది. ఇరు సంస్థలు కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో అధునాతన చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాయి. ఇక్కడి నుంచి కారకాల్‌ వివిధ ఆయుధాలను ఎగుమతి కూడా చేయనుంది.

ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)