Breaking News

దేశంలోనే రిచెస్ట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌.. జీతం రూపాయి!

Published on Sat, 11/30/2024 - 14:09

దేశంలో ఐఏఎస్‌ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్‌ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్‌లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.

అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్‌కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్‌ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చోటు సంపాదించారు.

ఉన్నత వ్యాపార కుటుంబం
అమిత్ కటారియా రియల్ ఎస్టేట్‌లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి  ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్‌లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్‌లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.

అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా  కమర్షియల్‌ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. కాగా అమిత్‌ కటారియా నెట్‌వర్త్‌ సుమారు రూ.8.90 కోట్లని అంచనా.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)