Breaking News

రిటైల్‌ షాపులకు భలే డిమాండ్‌ 

Published on Sun, 10/12/2025 - 06:12

న్యూఢిల్లీ: రిటైల్‌ వాణిజ్య వసతులకు డిమాండ్‌ బలంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో షాపింగ్‌ మాల్స్, ప్రముఖ ప్రాంతాల్లోని రిటైల్‌ వసతుల (ప్రధాన రహదారుల వెంట/హైస్ట్రీట్‌) లీజింగ్‌ సెపె్టంబర్‌ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే 45 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా టాప్‌– 8 నగరాల్లో 2.41 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్‌ నమోదైంది.

 క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 1.66 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఈ వివరాలను విడుదల చేసింది. ‘‘భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధి క్రమంలో కొనసాగుతోంది. వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో నాణ్యమైన రిటైల్‌ వసతులకు డిమాండ్‌ పెరుగుతోంది’’అని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎండీ గౌతమ్‌ సరాఫ్‌ తెలిపారు. 

నగరాల వారీ లీజింగ్‌..  
→ హైదరాబాద్‌లో 0.51 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ మేర రిటైల్‌ వసతుల లీజింగ్‌ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 0.49 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 3.5 శాతం పెరిగింది. 
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఏకంగా 87 శాతం అధికంగా 0.51 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ రిటైల్‌ లీజింగ్‌ జరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 0.27 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది.  
→ ముంబై మార్కెట్‌లో క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 0.22 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే రెట్టింపై 0.59 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.  
→ పుణెలోనూ 85 శాతం అధికంగా 0.33 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ మేర రిటైల్‌ వసతుల లీజింగ్‌ నమోదైంది. 
→ బెంగళూరులో లీజింగ్‌ 13 శాతం తగ్గి 0.18 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.  
→ చెన్నై మార్కెట్లో 8 శాతం వృద్ధితో రిటైల్‌ లీజింగ్‌ 0.16 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.  
→ అహ్మదాబాద్‌లో 27 శాతం తక్కువగా 0.06 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి లీజు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 0.09 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ కోల్‌కతాలో 12 శాతం పెరిగి 0.06 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ మేర లీజింగ్‌ లావాదేవీలు జరిగాయి.  

ప్రీమియం వసతులకు డిమాండ్‌.. 
కొత్త మాల్స్‌ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి రావడంతోపాటు, క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ తక్కువగా ఉండడం, అధిక వృద్ధికి కారణమైనట్టు డీఎల్‌ఎఫ్‌ వైస్‌ చైర్మన్, ఎండీ శ్రీరామ్‌ ఖట్టర్‌ తెలిపారు. ‘‘వినియోగదారులు కేవలం ఉత్పత్తినే కాకుండా మెరుగైన అనుభవం (వసతులు) కోసం చూస్తున్నారు. దీంతో మేము ప్రీమియం వసతులను ఆఫర్‌ చేయడంపై దృష్టి సారించాం’’అని ఖట్టర్‌ వివరించారు.

 భారత వినియోగ మార్కెట్‌ పట్ల దేశ, విదేశీ బ్రాండ్లలో విశ్వాసం పెరగడం వల్ల బలమైన లీజింగ్‌ నమోదైనట్టు నెక్సస్‌ సెలక్ట్‌ మాల్స్‌ ప్రెసిడెంట్‌ నిజార్‌ జైన్‌ తెలిపారు. దేశ మధ్యతరగతి వర్గం పెరుగుతుండంతో వినియోగ మార్కెట్‌ విషయమై రిటైలర్లలోనూ బలమైన విశ్వాసం నెలకొన్నట్టు ఆరోణ్‌ గ్రూప్‌ ఎండీ నిమిష్‌ అరోరా తెలిపారు. డీ2సీ బ్రాండ్లు ఇప్పుడు ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లోనూ విస్తరణపై దృష్టి పెట్టినట్టు చెప్పారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)