Breaking News

ధరల ఎఫెక్ట్‌.. దేశంలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

Published on Mon, 02/13/2023 - 19:48

దేశంలో నిత్యవసరాల ధరల మంట మండుతోంది. పెట్రోల్‌,డీజిల్‌తో పోటీగా కూరగాయలు, వంటనూనెల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరా భారం నిరుపేదలనే కాకుండా మధ్యతరగతి, ఆపై వర్గాల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దూసుకెళ్తుంది.

డిసెంబర్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం  4.19 శాతం ఉండగా..జనవరిలో 5.94 శాతానికి చేరింది. ప్రైస్‌ ఇండెక్స్‌ బాక్స్‌ ప్రకారం..రిటైల్‌ ద్రవ్యోల్బణంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం వాటా దాదాపు 40 శాతంగా ఉంది.

ఆర్‌బీఐ తొలిసారి మూడు నెలల కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేసింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది. 

దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరిగడం వల్లే రీటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి.

ద్రవ్యోల్బణం అంటే
వస్తువుల సాధారణ ధరలు ఒక పీరియడ్​ ఆఫ్ టైమ్​లో క్రమంగా పెరిగే స్థాయినే ద్రవ్యోల్బణం అంటారు. మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాది ఇలా ఒక పర్టిక్యులర్ కాలాన్ని లెక్కలోకి తీసుకొని ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)