Breaking News

ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ కోసం.. తొలి జాయింట్ వెంచర్‌

Published on Thu, 01/30/2025 - 15:44

ముంబై: రీ సస్టెయినబిలిటీ కంపెనీ (ReSL)లో భాగమైన రీ సస్టెయినబిలిటీ అండ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (Re Sustainability and Recycling Private Limited (ReSRL)) మరియు స్పెషాలిటీ కెమికల్స్ విభాగంలో పేరొందిన ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ (AIL) అనుబంధ సంస్థ ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ (Aarti Circularity Limited (ACL)) కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు చేతులు కలిపాయి. ప్లాస్టిక్ వనరుల రికవరీ మరియు పర్యావరణహిత వనరుల నిర్వహణ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా భారతదేశవ్యాప్తంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ఫెసిలిటీలను (PMRF) అభివృద్ధి చేసే క్రమంలో భారత్‌లో ఈ తరహాలో ఇదే తొలి జాయింట్ వెంచర్‌గా నిలవనుంది.

ప్లాస్టిక్స్ సహా వివిధ వ్యర్ధాలను వేరు చేసి, వనరులను వెలికి తీసి, రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి సరుకుగా, ఇంధనాలుగా లేదా రీసైకిల్డ్ పాలిమర్ ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగపడే అడ్వాన్స్‌డ్ సర్క్యులర్ మెటీరియల్స్ (ఏసీఎం) ఉత్పత్తి చేయడంపై పీఎంఆర్‌ఎఫ్‌లు ప్రధానంగా దృష్టి పెడతాయి. 2030 నాటికి రోజుకు కనీసం సుమారు 500 టన్నుల వనరుల రికవరీ సామర్థ్యాన్ని సాధించాలని భాగస్వామ్యం నిర్దేశించుకుంది. అలాగే మెటీరియల్, పవర్ సర్క్యులారిటీని గరిష్ట స్థాయిలో మెరుగుపర్చే దిశగా, ReSL కార్యకలాపాల ద్వారా కూడా ఉత్పత్తయ్యే వాటితో సహా వివిధ ఫీడ్‌స్టాక్స్‌ను పరిశీలించాలని కూడా నిర్దేశించుకుంది.

ఈ భాగస్వామ్యం కింద తొలి ప్లాస్టిక్స్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ప్లాంటు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ప్రాంతీయంగా అధునాతన రీసైక్లింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది. పర్యావరణహితమైన విధంగా వ్యర్ధాల నిర్వహణను చేపట్టే దిశగా సాగుతున్న భారత ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా నిలవగలదు. సుస్థిరత మరియు సాంకేతిక ఆవిష్కరణల విషయంలో ఇరు సంస్థలకు గల నిబద్ధతకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది.  భారతదేశపు రీసైక్లింగ్ మరియు వ్యర్ధాల  నిర్వహణ రంగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా, అధునాతన పీఎంఆర్‌ఎఫ్‌లను రూపొందించి, నిర్వహించేందుకు తగిన అగ్రగామి సాంకేతిక భాగస్వాములను జాయింట్ వెంచర్ కంపెనీ ఎంచుకుంటుంది.

“పర్యావరణహితంగా వనరులను నిర్వహించే దిశగా సాగుతున్న మా ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. వ్యర్ధాల నిర్వహణ మరియు వనరుల రికవరీకి సంబంధించి మాకున్న అపార అనుభవం మరియు ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క సుసంపన్నమైన వారసత్వం మరియు స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఆ సంస్థకున్న 40 ఏళ్ల అనుభవం ఈ భాగస్వామ్య ఒప్పందానికి దన్నుగా నిలవనున్నాయి. క్రిటికల్ వ్యర్ధాల  సవాళ్లను పరిష్కరించే అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాకు తోడ్పడనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలు మరియు పర్యావరణహిత విధానాలను ఉపయోగించడం ద్వారా వనరులను సమర్ధంగా నిర్వహించుకోవడం మరియు సర్క్యులారిటీ తోడ్పాటుతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థను సృష్టించాలనేది మా లక్ష్యం. భారత్‌లోను, ఇతర ప్రాంతాల్లోనూ సుస్థిర అభివృద్ధికి సంబంధించి మేము సమష్టిగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాం” అని రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో Mr. మసూద్ మాలిక్ తెలిపారు.

“ACL, ReSRL మధ్య భాగస్వామ్యమనేది, రెండు దిగ్గజ సంస్థల శక్తి, సామర్థ్యాల మేలు కలయిక ద్వారా, సుస్థిరతకు నవకల్పనలను మేళవించి తీవ్రమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు తోడ్పడగలదు. ఈ జేవీ ద్వారా భారతదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ రీసైక్లింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనేది మా లక్ష్యం. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం, సహజ వనరుల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమనే ఏసీఎల్ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుంది” అని ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ డైరెక్టర్ Mr. మిరిక్ గోగ్రి (Mirik Gogri) తెలిపారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు