Breaking News

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి..

Published on Thu, 08/10/2023 - 11:14

Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు రేపో రేటు మీద కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత మూడు రోజులుగా జరుగుతున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచాలని తీర్మానించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంలోనే ఉండేలా చూసేందుకు సెంట్రల్ బ్యాంక్ కమిటీ కూడా వసతి వైఖరుల ఉపసంహరణను కొనసాగించింది.

రేపో రేటు గత మూడు సార్లుగా ఎటువంటి మార్పుకు లోనుకాకుండా నిలకడగా ఉంది. అంతకు ముందు సెంట్రల్ బ్యాంక్ పాలసీ కమిటీ రెపో రేటుని 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు 250 బేసిస్ పాయింట్లను పెంచింది. మే 2023లో ద్రవ్యోల్బణం కనిష్టంగా 4.3 శాతానికి చేరింది. అయితే జూన్‌లో పెరిగిన ధరల ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరల కారణంగా జూలై అండ్ ఆగస్టులో పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.

ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

FY2023-24 CPI ద్రవ్యోల్బణం అంచనా కూరగాయల ధరల కారణంగా 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. అదే సమయంలో GDP అంచనా 6.5 శాతం వద్ద నిలిచింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు కావున కస్టమర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం పెరిగే అవకాశం లేదు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)