Breaking News

ఖాతాదారులకు షాక్.. రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్!

Published on Fri, 07/07/2023 - 14:50

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించిన ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర బుల్ధానా కేంద్రంగా ఉన్న మల్కాపుర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Malkapur Urban Co-operative Bank Ltd), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్' (Shushruti Souharda Sahakara Bank) లైసెన్సులను ఆర్‌బీఐ రద్దు చేసింది. గత బుధవారం రోజు బ్యాంకింగ్ లావాదేవీలు జరగకుండా సీజ్ చేసింది.

రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతే కాకుండా డిపాజిటర్లకు కూడా పూర్తిగా డబ్బు చెల్లించే స్థితిలో లేనట్లు ఆర్‌బీఐ నిర్దారించింది. లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ)

డిఐసీజీసీ ప్రకారం మల్కాపుర్ సహకార బ్యాంక్ 97.60 శాతం మంది డిపాజిటర్లు తిరిగి వారి అమౌంట్ పొందటానికి అర్హులని తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్‌లో 91.92 శాతం మంది డిపాజిటర్లు అర్హులుగా తెలుస్తోంది. డిపాజిటర్లు దీనిని తప్పకుండా గమనించాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)