Breaking News

టెక్‌ దిగ్గజం ఇంటెల్‌ ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌

Published on Mon, 08/21/2023 - 14:44

IntelLayoffs2023: అమెరికాకుచెందిన టెక్‌ దిగ్గజం ఇంటెల్ఉ ద్యోగులకు  షాకింగ్‌ న్యూస్‌. తాజాగా మరో రౌండ్ ఉద్యోగ కోతలకు నిర్ణయించినట్టు  తెలుస్తోంది. ఆర్థిక సవాళ్లు, ఆదాయాల క్షీణత,  ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా  సుమారు 140 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది.  వీరిలో అమెరికాకు కాలిఫోర్నియా ఫోల్సమ్  క్యాంపస్‌ నుంచి 89 మంది, శాన్ జోస్ కార్యాలయంలో  51 మంది  ప్రభావితం కానున్నారు.  (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!)

ఇంటెల్  లేఆఫ్స్‌ 2023
నివేదికల ప్రకారం, GPUలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ AI కంప్యూటింగ్  తదితర విభాగాల్లో  సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇతరరులను తొలగించనుంది. ఆగస్టు 31 నుండి ఈ ఉద్యోగ కోతలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొలగించిన వారిలో కొంతమందికి కంపెనీలో కొత్త స్థానాలు ఇవ్వచ్చు అని అంచనా. (గుడ్‌న్యూస్‌:11 నెలల గరిష్టానికి ఈపీఎఫ్‌వో సభ్యులు)

మేలో ఇంటెల్ ఏమి చెప్పింది
అయితే ఇంటెల్ ఇంకా పింక్ స్లిప్‌లను ధృవీకరించలేదు. కానీ శాంటా క్లారా-ప్రధాన కార్యాలయ చిప్‌మేకర్ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సిబ్బందిని తొలగించుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్టు ఈ ఏడాది మేలో సంకేతాలందించింది. గత ఏడాది డిసెంబరులో 201 సిబ్బందిని తొలగించింది. ఈ సంవత్సరం జనవరి నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, కాలిఫోర్నియాలో 13,500 మందితో సహా 2022 చివరి నాటికి 131,000 మంది ఉద్యోగులు ఉన్నారని ఇంటెల్ వెల్లడించిన సంగతి విదితమే.

స్థూల-ఆర్థిక  సవాళ్లమధ్య తమ వ్యూహాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో ఫంక్షన్-నిర్దిష్ట వర్క్‌ఫోర్స్ తగ్గింపులతో సహా బహుళ కార్యక్రమాల ద్వారా ఖర్చు తగ్గింపులు ,సామర్థ్య లాభాలను గుర్తించడంపై దృష్టి సారించామని కంపెనీ తెలిపింది.  ఈ నిర్ణయం కఠినమైనదే కానీ, ప్రభావితమైన ఉద్యోగులను గౌరవంగా చూసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు