Breaking News

రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?

Published on Wed, 01/10/2024 - 09:03

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్‌ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్‌ మోడల్స్‌ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్‌ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్‌లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్‌ కంట్రీ సీఈవో వెంకట్రామ్‌ మామిళ్లపల్లె తెలిపారు.

మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్‌ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్‌ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్‌తో పాటు కైగర్, ట్రైబర్‌లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్‌ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్‌ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్‌ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్‌లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్‌ స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)