Breaking News

ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్‌

Published on Thu, 08/01/2024 - 04:46

వాషింగ్టన్‌: ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనను సిలికాన్‌ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్‌ వ్యాలీ ప్రెసిడెంట్‌ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

 ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్‌ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం.

 ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్‌–యూఎస్‌ కారిడార్‌లో ఏంజెల్‌ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు కోసం డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం. 

స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. 
భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్‌ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్‌ఏ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ కరుణ్‌ రిషి పేర్కొన్నారు.  

రిపాట్రియేషన్‌లోనూ సంస్కరణలు అవసరం 
స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్‌ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్‌ అన్నది అధిక శాతం ఎన్‌ఆర్‌ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. రిపా్రటియేషన్‌కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్‌ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)