Breaking News

మర్చిపోయారా? గ్యాడ్జెట్‌ గుర్తు చేస్తుంది!

Published on Sun, 11/09/2025 - 16:50

ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకోలేని వారంతా ఇప్పుడు, టెన్షన్  పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్‌ మీ జ్ఞాపకాలను జాగృతం చేసే గ్యారంటీ ఇస్తున్నాయి.

చంద్రుడి వెలుగులా!
చీకట్లో బెడ్‌మీద పుస్తకం చదవాలంటే ఒకవైపు లైట్‌ కోసం పోరాటం, మరోవైపు ‘స్విచ్‌ ఆఫ్‌ చెయ్యి!’ అనే డిస్టర్బ్‌ చేసే డైలాగులు! ఇవన్నీ దూరం చేయడానికి ఇప్పుడు ఒక హీరో వచ్చేశాడు. అదే గ్లోకుసెంట్‌ బుక్‌ లైట్‌! చిన్నగా కనిపించే ఈ లైట్‌ పనిలో మాత్రం బాస్‌ లెవెల్‌! మూడు కలర్‌ మోడ్‌లు, ఐదు బ్రైట్‌నెస్‌ లెవెల్స్‌తో కళ్లకు ఇబ్బంది లేకుండా సాఫ్ట్‌గా వెలిగిస్తుంది. పుస్తకానికి క్లిప్‌లా తగిలించుకుని చీకట్లో చంద్రుడి వెలుగులో చదివేయొచ్చు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే ఎనభై గంటల వరకు నిరంతరామంగా వెలుగుతుంది. యూఎస్‌బీ రీచార్జబుల్, ఫ్లెక్సిబుల్, పోర్టబుల్, క్యూట్‌ పుస్తకప్రియుల రాత్రుల కోసం పర్‌ఫెక్ట్‌ స్నేహితుడు! దీని ధర రూ. 1,449.

మాయా ట్యాగ్‌!
తాళాలు ఎక్కడో, వాలెట్‌ ఏ సోఫా కిందో, బ్యాగ్‌ ఎవరో తీసుకెళ్లారో? ఇలా మీ రోజూ వివిధ వస్తువుల ‘సర్చ్‌ మిషన్’లా మొదలవుతుందా? ఇకపై ఏది పోయినా కంగారు పడాల్సిన పని లేదు! ఎందుకంటే నీ వస్తువులకి ఇప్పుడు బాడీగార్డ్‌ వచ్చేశాడు. అదే అమెజాన్ బేసిక్స్‌ ఏరో ట్యాగ్‌! ఇది మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్తుంది, అది కూడా ఒక్క బీప్‌తోనే! ఈ చిన్న తెల్ల ట్యాగ్‌లో బ్లూటూత్‌ 5.3 టెక్నాలజీ, ఆపిల్‌ ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ సపోర్ట్, 80 డెసిబెల్స్‌ సౌండ్‌ అలర్ట్‌ ఉన్నాయి. వాలెట్, కీస్, బ్యాగ్‌ ఇలా దేనికైనా తగిలించుకొని వాడుకోవచ్చు. అవి కనిపించనప్పుడు, ఒక్కసారి ఫోనులో యాప్‌ ఓపెన్  చేసి బటన్  నొక్కితే చాలు, ఆ వస్తువు ఎక్కడుందో చెప్తుంది. తేలికగా ఉంటుంది, సిమ్‌ అవసరం లేదు, బ్యాటరీతో పనిచేస్తుంది. ధర రూ. 537 మాత్రమే!

టచ్‌తోనే తెలిసిపోతుంది
చల్లని నీళ్లు తాగాలనుకుని బాటిల్‌ ఓపెన్  చేస్తే లోపల మరిగిన నీరు! చేతికి వేడి, ముఖానికి షాక్‌! ఇక ఆ కన్ఫ్యూజన్ స్టోరీకి ఎండ్‌! ఎందుకంటే ఎల్‌ఈడి స్మార్ట్‌ టెంపరేచర్‌ బాటిల్‌ నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా ముందే చెప్తుంది. ఈ బాటిల్‌లోని డిస్‌ప్లేను టచ్‌ చేస్తే వెంటనే నీళ్ల ఉష్ణోగ్రత చూపిస్తుంది. చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా అన్నది సెకన్లలో బాటిల్‌ ఓపెన్‌ చేయకుండానే తెలుసుకోవచ్చు. హాట్‌ డ్రింక్స్‌ను పన్నెండు గంటలు, కూల్‌ డ్రింక్స్‌ను ఇరవై నాలుగు గంటల వరకు అదే టెంపరేచర్‌లో ఉంచుతుంది. స్టెయిన్లెస్‌ స్టీల్‌తో తయారైన ఈ బాటిల్‌ తేలికగా, క్యూట్‌గా, ఫ్యాన్సీగా ఉంటుంది. ధర రూ. 295 మాత్రమే!

#

Tags : 1

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)