Breaking News

వరల్డ్‌ ఫేమస్‌ లగ్జరీ బ్రాండ్‌ను తీసుకొచ్చిన రిలయన్స్‌

Published on Mon, 10/07/2024 - 20:24

రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన సౌందర్య ఉత్పత్తుల వేదిక ‘తీరా’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అగస్టినస్ బాడర్ కలెక్షన్‌ ప్రత్యేకంగా తీరా ఆన్‌లైన్‌తోపాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరులోని ఎంపిక చేసిన తీరా స్టోర్లలో అందుబాటులో ఉందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

దేశంలో తీరా స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఈ అగస్టినస్ బాడర్‌ బ్రాండ్‌ను ప్రపంచ ప్రఖ్యాత స్టెమ్ సెల్, బయోమెడికల్ శాస్త్రవేత్త  ప్రొఫెసర్ అగస్టినస్ బాడర్ స్థాపించారు. ఈ బ్రాండ్‌ ఉత్పత్తులతోపాటు వ్యక్తిగత స్కిన్‌కేర్‌ అవసరాలకు ఏ ఉత్పత్తులను ఎంచుకోవాలన్నదానిపై కస్టమర్లకు ఎక్స్‌పర్ట్‌ గైడెన్స్‌ కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

యూరోమానిటర్ ఎస్టిమేట్స్‌ ప్రకారం.. భారతదేశ బ్యూటీ మార్కెట్ 2025 నాటికి 20 బిలియన్‌ డాలర్లకు పెరగనుంది. అందులోనూ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ 15% వృద్ధి చెందనుంది. దేశంలో స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల మార్కెట్‌ విలువ 2022లో 6.53 బిలియన్‌ డాలర్లు. ఇది 2027 నాటికి 8.84 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని రీసెర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ డేటా చెబుతోంది.

బ్యూటీ మార్కెట్‌ వృద్ధి నేపథ్యంలో నైకా, టాటా క్లిక్‌ ప్యాలెట్‌, మింత్రా వంటి సంస్థలతో రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ తీరా పోటీ పడుతోంది. ఆన్‌లైన్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ డజను ఆఫ్‌లైన్‌ స్టోర్లను కూడా తీరా ప్రారంభించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)