Breaking News

వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్‌

Published on Mon, 10/14/2024 - 13:23

వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని ట్రాయ్‌ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్‌ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.

దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్‌ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్‌ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్‌కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్‌కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్‌ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలు

టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్‌ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్‌ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్‌ తన కన్సల్టేషన్ పేపర్‌లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్‌ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)