Breaking News

ఇజ్రాయెల్ కంపెనీతో జతకట్టిన రిలయన్స్

Published on Tue, 09/10/2024 - 20:10

భారతదేశపు రిలయన్స్ రిటైల్ వెంచర్.. సెప్టెంబర్ 10న ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం డెల్టా గలీల్ ఇండస్ట్రీస్‌తో జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. ఇన్నర్‌వేర్ మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా 50/50 జాయింట్ వెంచర్‌ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా డెల్టా గలీల్.. రిలయన్స్ ఉత్పత్తుల డిజైన్ అండ్ తయారీకి సహకరిస్తుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో తన పాదముద్రను విస్తరించేందుకు డెల్టా గలీల్ ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగానే రిటైల్, హోల్‌సేల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది.

భారతీయ వినియోగదారుల డిమాండ్స్ తీర్చడానికి.. వారు కోరుకునే దుస్తుల ఆవిష్కరణలను ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం. కంపెనీ గణనీయమైన వృద్ధికి కూడా ఈ జాయింట్ వెంచర్ దోహదపడుతుంది. డెల్టా గలీల్ ఇండస్ట్రీస్ అనేది పురుషులు, మహిళలు, పిల్లల కోసం బ్రాండెడ్ & ప్రైవేట్ లేబుల్ దుస్తులను అందించే సంస్థ. ఈ కంపెనీ 1975లో ప్రారంభమైంది.

రిలయన్స్ రిటైల్ & డెల్టా గలీల్ భాగస్వామ్యం గురించి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతీయ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రిలయన్స్‌తో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని డెల్టా గలీల్ సీఈఓ పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)