Breaking News

రిలయన్స్‌ రిటైల్‌ 600 డార్క్‌ స్టోర్లు ప్రారంభం

Published on Tue, 10/21/2025 - 08:57

రిలయన్స్ రిటైల్ (Reliance Retail) దేశవ్యాప్తంగా 600కు పైగా డార్క్‌ స్టోర్‌లను ఇప్పటికే ప్రారంభించిందని ఇటీవల తెలిపింది. వినియోగదారులకు డెలివరీలను వేగవంతం చేయడానికి మరిన్నింటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.

డార్క్‌ స్టోర్‌లు అంటే ఏమిటి?

డార్క్‌ స్టోర్ (Dark Store) అనేది రిటైల్ వ్యాపారానికి సంబంధించిన ఒక నూతన విధానం. దీన్నే ‘డార్క్‌ షాప్’, ‘డార్క్‌ సూపర్ మార్కెట్’ అని కూడా పిలుస్తారు. ఈ స్టోర్‌లు సాధారణంగా కస్టమర్‌ల కోసం ఏర్పాటు చేసినవి కావు. అంటే కస్టమర్‌లు లోపలికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా పరిశీలించడానికి అనుమతి ఉండదు.

ఆన్‌లైన్ ఆర్డర్‌ల నిర్వహణకు..

ఇది ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఆర్డర్‌లను (Online Orders) సిద్ధం చేయడానికి, ప్యాక్ చేయడానికి, డెలివరీ చేయడానికి ఉద్దేశించిన ఒక వేర్‌హౌస్ (Warehouse) లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లాగా పనిచేస్తుంది. వేర్‌హౌస్‌ లోపల వస్తువులను వేగంగా ఎంచుకోవడానికి, ప్యాక్ చేయడానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణ సూపర్ మార్కెట్ లాగా అల్మారాలు ఉన్నప్పటికీ కస్టమర్‌లను ఆకర్షించే డిస్‌ప్లేలు, ప్రచార సైన్‌బోర్డ్‌లు ఇందులో ఉండవు.

ప్రధాన లక్ష్యం

డార్క్‌ స్టోర్‌ల ప్రధాన లక్ష్యం ఆన్‌లైన్ ఆర్డర్‌లు, నిత్యవసరాలు, ఆహార పదార్థాలు వంటి వాటిని తక్కువ సమయంలో (క్విక్-కామర్స్), వేగంగా డెలివరీ చేయడం. రిలయన్స్ రిటైల్ కూడా 30 నిమిషాల లోపు డెలివరీలను విస్తరించడానికి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డార్క్‌స్టోర్లను ఉపయోగిస్తోంది.

ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)