Breaking News

‘ఫార్చూన్‌’లో మళ్లీ రిలయన్స్‌ టాప్‌

Published on Thu, 07/31/2025 - 05:18

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) ఫార్చూన్‌ గ్లోబల్‌–500 కంపెనీల జాబితాలో భారత్‌ నుంచి తొమ్మిది కంపెనీలకు చోటు లభించింది. వీటిలో అయిదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా, నాలుగు ప్రైవేట్‌ రంగానికి చెందినవి. అన్నింటికన్నా మెరుగ్గా ప్రైవేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 88వ స్థానంలో నిల్చింది. అయితే, 2024లోని 86వ ర్యాంకు నుంచి రెండు స్థానాలు తగ్గింది.

 అటు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) 95వ ర్యాంకులో కొనసాగింది. 22 ఏళ్లుగా ఫార్చూన్‌ గ్లోబల్‌ లిస్టులో స్థానం దక్కించుకుంటున్న ఏకైక ప్రైవేట్‌ రంగ కంపెనీ రిలయన్స్‌ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రిలయన్స్‌ స్థూల ఆదాయం 7.1% పెరిగి రూ. 10,71,174 కోట్లకు చేరింది. 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను బట్టి కంపెనీలకు ర్యాంకింగ్‌ ఉంటుంది.  

ఐవోసీ డౌన్‌.. ఎస్‌బీఐ అప్‌.. 
అటు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) 11 ర్యాంకులు తగ్గి 127వ స్థానానికి పడిపోగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 15 స్థానాలు మెరుగుపడి 163 ర్యాంకును, హెచ్‌డీఎఫ్‌సీ 48 స్థానాలు ఎగబాకి 258వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) ఒక ర్యాంకు తగ్గి 181వ స్థానానికి పరిమితమైంది. ఇక మిగతా వాటిలో టాటా మోటార్స్‌ (283 ర్యాంకు, 12 స్థానాలు డౌన్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (285 స్థానం, 27 స్థానాల క్షీణత), ఐసీఐసీఐ బ్యాంక్‌ (464 ర్యాంకు, ఎలాంటి మార్పు లేదు) ఉన్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)