Breaking News

రయ్‌..మన్న రిలయన్స్‌ పవర్‌ షేర్లు..

Published on Thu, 02/06/2025 - 13:20

అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ (Reliance Power) తన క్యూ3 ఆదాయాలను ప్రకటించిన తర్వాత ఆ సంస్థ షేర్లు రయ్‌..మని ఎగిశాయి.  గురువారం (ఫిబ్రవరి 6) ప్రారంభ డీల్స్‌లో రిలయన్స్ పవర్ షేర్లు (shares) 9% పైగా పెరిగాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థ రూ.41.95 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో అనిల్‌ అంబానీ కంపెనీ రూ.1136.75 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

అయితే కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం  క్యూ3లో 4.68% తగ్గి రూ.1852.84 కోట్లకు చేరింది. ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ.1943.83 కోట్లుగా ఉండేది. గడిచిన త్రైమాసికంలో  లాభం చెల్లించాల్సిన పన్నుతో కలిపి రూ.49.88 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1168.70 కోట్ల నష్టం ప్రకటించింది. రిలయన్స్ పవర్ ఒక్కో షేరుకు ఆదాయం ఈ క్యూ3లో రూ.0.104గా ఉంది.  ఇది గతేడాది క్యూ3లో రూ.3,298 (మైనస్)గా ఉంది.

గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,998.79 కోట్ల నుంచి రూ.2,159.44 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.3,167.49 కోట్ల నుంచి రూ.2,109.56 కోట్లకు తగ్గాయి. కంపెనీ జీరో బ్యాంక్ రుణ స్థితిని సాధించిందని, అంటే ప్రైవేట్ లేదా పబ్లిక్ ఏ బ్యాంకులోనూ తమకు ఎటువంటి బకాయిలు లేవని రిలయన్స్‌ పవర్‌ తెలిపింది.

ఒక్కో రిలయన్స్ పవర్ షేర్‌ అంతకుముందు ముగింపు రూ.39.89తో పోలిస్తే గురువారం (ఫిబ్రవరి 6) 9.52% పెరిగి రూ.43.69కి చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.17,252 కోట్లుగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 42.76 లక్షల షేర్లు చేతులు మారాయి. బీఎస్‌ఈలో వీటిపై మొత్తం రూ.18.17 కోట్ల టర్నోవర్ జరిగింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)