Breaking News

అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లు

Published on Mon, 05/19/2025 - 11:50

భూటాన్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రిలయన్స్ పవర్ ఆ దేశానికి చెందిన గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడితో భూటాన్ పెట్టుబడి సంస్థ డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌(డీహెచ్ఐ)తో కలిసి జాయింట్ వెంచర్((50-50)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

క్లీన్ ఎనర్జీ విస్తరణ

భూటాన్ చాలాకాలంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుంది. ఈ రంగం దాని ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తుంది. అయినప్పటికీ సౌర విద్యుత్‌ను విస్తరిస్తూ పునరుత్పాదక ఇంధన రంగాన్ని వైవిధ్యపరచడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. సౌరశక్తిని పెంచుకోవడం ద్వారా భూటాన్ మరింత స్థిరమైన ఇంధన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి: భూమార్గాల ద్వారా దిగుమతులపై భారత్ నిషేధం

రిలయన్స్ పవర్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌  ఏర్పాటు కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులను సమీకరిస్తోంది. ఈ జాయింట్‌ వెంచర్ ప్రాంతీయ ఇంధన భద్రతను పెంచుతుందని, సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, దక్షిణాసియాలో భూటాన్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా నిలుపుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)