Breaking News

భారత కంపెనీల్లో టాప్‌ ర్యాంకర్‌గా రిలయన్స్‌

Published on Thu, 08/03/2023 - 07:15

న్యూఢిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ గ్లోబల్‌ 500, 2023 జాబితాలో మెరుగైన స్థానాన్ని సంపాదించింది. 16 స్థానాలు మెరుగుపడి 88వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2022 జాబితాలో రిలయన్స్‌ స్థానం 104గా ఉండడం గమనించొచ్చు. 

భారత కంపెనీల్లో టాప్‌ ర్యాంకర్‌గా రిలయన్స్‌ నిలిచింది. 2021 నుంచి చూస్తే రిలయన్స్‌ అంతర్జాతీయంగా తన ర్యాంక్‌ని గణనీయంగా పెంచుకుంది. 2021లో రిలయన్స్‌ స్థానం 155గా ఉంది. ఇక ఈ ఏడాది ఫార్చూన్‌ 500 జాబితాలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 94వ స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాదితో పోలిస్తే 48 మెట్లు పైకెక్కింది. 

ఎల్‌ఐసీ 9 స్థానాలు దిగజారి 107వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఓఎన్‌జీసీ 158, బీపీసీఎల్‌ 233, ఎస్‌బీఐ 235 ర్యాంకులు దక్కించుకున్నాయి. టాటా మోటార్స్‌ ర్యాంక్‌ 33 స్థానాలు మెరుగుపడి 337కు చేరింది. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 84 స్థానాలు ముందుకు వచ్చి 353 ర్యాంకును సొంతం చేసుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ 500 జాబితాలో చోటు సంపాదించుకోవడం 20వ ఏడాది కావడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)