Breaking News

జియో ప్రీమియం డీజిల్‌.. అన్నింటి కంటే తక్కువ ధరకే!

Published on Tue, 05/16/2023 - 17:02

Jio-bp premium diesel: ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నడుపుతున్న భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రాష్ట్ర ఇంధన హోల్‌సేలర్ల కంటే తక్కువ ధరకే డీజిల్‌ను విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: SEBI on Adani: అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్‌

జియో-బీపీ (Jio-bp) ప్రీమియం డీజిల్‌ను తాజాగా ప్రారంభించింది. జియో-బీపీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకి చెందిన బీపీ అనే ఇంధన సంస్థల జాయింట్ రిటైలింగ్ వెంచర్. జియో-బీపీ ప్రారంభించిన ఈ  ప్రీమియం డీజిల్ ధర ఇతర ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు విక్రయస్తున్న సాధారణ డీజిల్‌ కంటే తక్కువగా ఉంది. భారతీయ వినియోగదారుల కోసం డీజిల్ ప్రమాణాలను పెంచడానికి యాక్టివ్ టెక్నాలజీతో కూడిన డీజిల్‌ను విడుదల చేస్తున్నట్లు జియో-బీపీ ప్రకటించింది.

భారీగా ఇంధన ఆదా
కొత్తగా లాంచ్ చేసిన డీజిల్ కంపెనీ నెట్‌వర్క్‌ పరిధిలోని అన్ని అవుట్‌లెట్‌లలోనూ అందుబాటులో ఉంటుందని, 4.3 శాతం మెరుగైన ఇంధన వ్యవస్థ కారణంగా ట్రక్కుల యజమానులకు ఒక్కో వాహనంపై సంవత్సరానికి రూ. 1.1 లక్షల వరకు ఆదా అవుతుందని జియో-బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని జియో-బీపీ అవుట్‌లెట్‌లో కొత్త ప్రీమియం డీజిల్‌ను లీటర్‌కు రూ. 91.30కి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఇతర ప్రభుత్వ రంగ పెట్రోల్ పంపుల వద్ద సాధారణ డీజిల్ ధర రూ. 92.28 ఉంది.

ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్‌ 40 లాంచ్‌కు రెడీ..  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)