Breaking News

స్మార్ట్‌ టీవీలకు జియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌

Published on Wed, 02/19/2025 - 08:14

స్మార్ట్‌ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ జియోటెలి ఓఎస్‌ను ఆవిష్కరించినట్లు రిలయన్స్‌ జియో వెల్లడించింది. దీనితో తయారైన థామ్సన్, కొడక్, బీపీఎల్, జేవీసీ వంటి బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ టీవీలు ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది మరిన్ని బ్రాండ్స్‌ చేతులు కలిపే అవకాశం ఉందని వివరించింది.

ఇదీ చదవండి: యూఎస్‌తో డీల్‌పై ఆందోళన అక్కర్లేదు

భారతీయ వినియోగదారుల అవసరాలను తీరుస్తూ, సరికొత్త వినోద అనుభూతిని అందించే కొత్త తరం ప్లాట్‌ఫాంగా జియోటెలి ఓఎస్‌ను జియో  అభివరి్ణంచింది. ఈ విభాగంలో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ టీవీ, వెబ్‌ఓఎస్, శాంసంగ్‌ టైజెన్‌లతో జియోటెలి ఓఎస్‌ పోటీపడనుంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం భారత్‌లో స్మార్ట్‌ టీవీల మార్కెట్‌ 1.34 కోట్ల యూనిట్‌గా ఉండగా, ఆదాయాలు సుమారు రూ. 52 వేల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఓపెన్‌ సెల్స్‌పై కస్టమ్స్‌ సుంకాలు తగ్గిస్తూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో స్థానికంగా డిస్‌ప్లేల అసెంబ్లింగ్‌కి ఊతం లభించి, అంతిమంగా తయారీ సంస్థలకు ఖర్చులు 5–10% ఆదా కాగలవని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వీపీ (రీసెర్చ్‌) నీల్‌ షా చెప్పారు.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)