Breaking News

జియో యూజర్లకు బంపరాఫర్: రూ.35000 విలువైన సర్వీస్ ఫ్రీ!

Published on Thu, 10/30/2025 - 20:30

అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉపయోగించే.. 18-25 సంవత్సరాల వయసు కలిగిన జియో వినియోగదారులు 18 నెలల పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని AI ప్రో సేవను ఉచితంగా పొందవచ్చు. దీనికోసం రిలయన్స్ కంపెనీ.. గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికి.. యువ సబ్‌స్క్రైబర్‌లకు గూగుల్ జెమినీ AI ప్రోను ఉచితంగా అందించడానికి కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. అర్హత కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లపై గూగుల్ AI ప్రో ఉచితంగా పొందవచ్చు. ఇది అపరిమిత చాట్‌, 2TB క్లౌడ్ స్టోరేజ్, Veo 3.1 లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ వంటివెన్నో అందిస్తుంది.

రూ. 349 నుంచి ప్రారంభమయ్యే 5జీ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లకు (ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్) ఉచిత జెమినీ ప్రో లభిస్తుంది. ఇది యాక్టివేషన్ చేసుకున్న రోజు నుంచి 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది (అపరిమిత 5G ప్లాన్‌ యాక్టివ్‌లో ఉండాలి). యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య & ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని మైజియో యాప్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

1.45 బిలియన్ భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ వంటి వ్యూహాత్మక & దీర్ఘకాలిక భాగస్వాములతో మా సహకారం ద్వారా, భారతదేశాన్ని అల్-ఎనేబుల్డ్ కాకుండా అల్-ఎంపవర్డ్ గా మార్చాలని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)