Breaking News

దీన్ని తగిలిస్తే సరి! ఎక్కడున్నా ఇట్టే దొరికిపోతుంది!!

Published on Wed, 07/10/2024 - 20:29

చాలా మంది కొన్ని సార్లు వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. అవసరానికి ఆ వస్తువు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జియోట్యాగ్ ఎయిర్ పేరుతో కొత్త ట్రాకింగ్ డివైజ్ ను రిలయన్స్ జియో ​లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన జియోట్యాగ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైజ్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.

జియోథింగ్స్‌ యాప్‌తో మాత్రమే పని చేసే జియోట్యాగ్ మాదిరిగా కాకుండా, జియోట్యాగ్ ఎయిర్ యాపిల్ ఫైండ్ మై ఫీచర్‌కూ అనుకూలంగా ఉంటుంది.  ఇది తాళం చెవిలు, ఐడీ కార్డులు, వాలెట్లు, పర్సులు, లగేజీలు ఇలా ఏ వస్తువుకైనా దీన్ని తగిలించవచ్చు. పెంపుడు జంతువుల మెడలోనూ వేయొచ్చు. ఇవి కనిపించకుండా పోయినప్పుడు ఈ గ్యాడ్జెట్‌ సాయంతో ట్రాక్ చేయొచ్చు.

ఇది ఐఓఎస్ 14 ఆపైన వెర్షన్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 9 ఆపైన వెర్షన్ ఆండ్రాయిడ్‌ డివైజ్ లలో పనిచేస్తుంది. వైర్ లెస్ డివైజ్ ట్రాకింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ను ఇందులో అందించారు. 90-120 డెసిబుల్స్ శబ్దం చేసే ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌ ఇందులో ఉంది. జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.2,999 ధరతో లిస్ట్ అయిన జియోట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,499కే లభిస్తుంది. బ్లూ, రెడ్, గ్రే కలర్ వేరియంట్లు ఉన్నాయి. పేటీఎం, క్రెడ్ యూపీఐ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)