ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
Breaking News
శామ్‌సంగ్‌తో ఆర్‌ఐఎల్ డీల్
Published on Tue, 03/17/2026 - 04:04
న్యూఢిల్లీ: గ్రీన్ అమోనియా సరఫరాకు వీలుగా దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్ సీఅండ్‌టీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తాజాగా వెల్లడించింది. 15ఏళ్ల కాలం అమల్లో ఉండే ఈ డీల్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,000 కోట్లు)గా తెలియజేసింది. ఇది ప్రపంచస్థాయి అమోనియా ఒప్పందాలలో ఒకటికాగా.. పూర్తిగా దేశీయంగా రూపొందించిన హరిత ఇంధనాన్ని ఎగుమతి చేయనుంది.
2028–29 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఇంధన సరఫరాలు ప్రారంభంకానున్నట్లు ఆర్‌ఐఎల్ వెల్లడించింది. శామ్‌సంగ్ సీఅండ్‌టీ కార్పొరేషన్ (దక్షిణ కొరియా)తో గ్రీన్ అమోనియా దీర్ఘకాలిక సరఫరా, కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.
2028–29 ద్వితీయార్ధం నుంచి 15ఏళ్లపాటు సరఫరాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం ద్వారా గ్రీన్ అమోనియాను రూపొందించనున్నట్లు వెల్లడించింది. దీనిని ఎరువులు, ఇండ్రస్టియల్ కెమికల్, షిప్పింగ్‌తోపాటు.. విద్యుదుత్పాదనలోనూ వినియోగించవచ్చని పేర్కొంది. ఆర్‌ఐఎల్ షేరు 1% బలపడి రూ. 1,395 వద్ద ముగిసింది.
Tags : 1