Breaking News

ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..!

Published on Thu, 12/21/2023 - 09:08

న్యూఢిల్లీ: దేశీయంగా మీడియాలో అత్యధికంగా కనిపించే (విజిబిలిటీ) కార్పొరేట్‌ సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వార్తల్లో కార్పొరేట్ల విజిబిలిటీని విశ్లేషించే విజికీ న్యూస్‌ స్కోర్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం 2023కి గాను రిలయన్స్‌ 96.46 స్కోరుతో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. గతేడాది ఇది 92.56గా, 2021లో 84.9గా నమోదైంది. నివేదికలోని మిగతా సంస్థల స్కోరుకు, రిలయన్స్‌ స్కోరుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఎస్‌బీఐకి 85.81, హెచ్‌డీఎఫ్‌సీకి 84.06, ఐసీఐసీఐ బ్యాంక్‌కి 81.9, భారతి ఎయిర్‌టెల్‌కు 80.64 స్కోరు లభించింది. 4,00,000 పైచిలుకు ప్రచురణ సంస్థల్లో వార్తలు, హెడ్‌లైన్స్, సదరు పబ్లికేషన్‌ విస్తృతి, రీడర్‌షిప్‌ మొదలైన వాటి ఆధారంగా ఈ స్కోరు ఇచ్చారు.

ఇందుకోసం కృత్రిమ మేథ, బిగ్‌ డేటా, మెషిన్‌ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతికతలను ఉపయోగించారు. విజికీ పరిశోధన ప్రకారం పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)పరంగా కూడా రిలయన్స్‌ పటిష్టంగా ఉంది. నాలుగేళ్ల క్రితం విజికీ న్యూస్‌ స్కోర్‌ ప్రారంభమైనప్పటి నుంచి రిలయన్సే అగ్రస్థానంలో ఉంటోంది. కంపెనీ స్కోరు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)