Breaking News

ఐఫోన్‌ చవగ్గా కావాలా?

Published on Sun, 02/02/2025 - 20:12

మీకు ఐఫోన్‌ అంటే ఇష్టమా? చవగ్గా తక్కువ ధరకు యాపిల్‌ ఐఫోన్‌ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. యాపిల్‌ తాజా మోడళ్ల ఐఫోన్‌ కొనుగోలు చేయలేని ఐఫోన్‌ (iPhone) ప్రియుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రిలయన్స్‌ డిజిటల్‌ (Reliance Digital) ఓ మంచి డీల్‌ తీసుకొచ్చింది. ఐఫోన్‌ 14 (iPhone 14)పై భారీ తగ్గింపును అందిస్తోంది.

యాపిల్‌ 2022లో లాంచ్‌ చేసిన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ 14 ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు రిటైల్ ధర రూ. 54,900 కాగా రిలయన్స్ డిజిటల్‌ దీనిపై రూ.6,500 తగ్గింపు అందిస్తోంది. ఫ్లాట్ రూ. 6,500 తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు  బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ల ద్వారా ఐఫోన్ 14 రూ. 47,400 లకే పొందవచ్చు. హెచ్‌ఎస్‌బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,000 వరకు అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో తుది ధర రూ. 46,400కి తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ. 8,500 తగ్గింపు.

ఐఫోన్‌ 14 ఫీచర్లు
2022 అక్టోబర్‌లో రూ. 79,900 బేస్ ధరతో యాపిల్‌ ఐఫోన్‌ 14 లాంచ్‌ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యంగా సేల్‌ ఈవెంట్‌ల సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్‌లలో ఐఫోన్‌ 14 ఒకటి. ఐఫోన్‌ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. యాపిల్‌ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా, సెల్ఫీ ప్రియుల కోసం డ్రాప్ నాచ్ 12MP ఫ్రంట్ షూటర్ కెమరా ఇందులో ఉన్నాయి.

ఇదిలా ఉండగా యాపిల్‌కు చెందిన తాజా సిరీస్‌ ఐఫోన్‌ 16 (iPhone 16). గత ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ను యాపిల్‌ భారత్‌లో లాంచ్‌ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కాగా ఊహించినట్లుగానే ఐఫోన్‌ 16 సిరీస్‌కు భారత్‌లో భారీ స్పందన లభించింది. మొదటి రోజే రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బేస్ మోడల్‌కు ఐఫోన్‌ 16 ధరలు రూ.79,900 కాగా ఐఫోన్‌ 16 ప్రో  ధర రూ. 144,900 వరకు ఉంది.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు