Breaking News

రిలయన్స్‌ భారీ ఫుడ్‌ పార్క్‌ 

Published on Fri, 09/12/2025 - 01:05

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి ఏకీకృత ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌(కాటోల్‌)లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌పై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ యూనిట్‌ ఏర్పాటుకు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. 

ఈ యూనిట్‌తో 500మందికిపైగా ఉపాధి కల్పించనుంది. 2026లో తయారీ యూనిట్‌ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్‌  చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సమీకృత ఫుడ్‌ పార్క్‌ల ఏర్పాటుకు రూ. 40,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్‌ పార్క్‌కు తెరతీయనున్నట్లు వివరించారు. రిలయన్స్‌ రిటైల్‌ నుంచి ఆవిర్భవించిన రిలయన్స్‌ కన్జూమర్‌ మూడేళ్లలోనే రూ. 11,000 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు ఏజీఎంలో తెలిపారు.
 

Videos

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

బాబు.. సిద్ధంగా ఉండు.. జగన్ గెలుపు ఖాయం..

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)