రూ. 1.21 లక్షల కోట్లు.. క్విప్‌ ద్వారా రికార్డ్‌ నిధులు

Published on Tue, 12/17/2024 - 10:01

న్యూఢిల్లీ: అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా నిధులను సమీకరించడంలో కంపెనీలు ఈ కేలండర్‌ ఏడాది(2024)లో  కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. జనవరి నుంచి నవంబర్‌వరకూ దేశీ కార్పొరేట్లు రూ. 1,21,321 కోట్లు అందుకున్నాయి.

దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం, షేర్ల అధిక విలువలు ఇందుకు సహకరిస్తున్నాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ప్రకారం గతేడాది క్విప్‌ ద్వారా రూ. 52,350 కోట్లు మాత్రమే సమకూర్చుకున్నాయి. వెరసి రెట్టింపునకు మించి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి.  

క్విప్‌ అంటే? 
లిస్టెడ్‌ కంపెనీలు సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా వేగంగా నిధులు సమీకరించేందుకు వీలు కల్పించేదే క్విప్‌. నవంబర్‌వరకూ 82 కంపెనీలు క్విప్‌ను చేపట్టాయి. గతేడాది కేవలం 35 కంపెనీలు రూ. 38,220 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది రికార్డుకు కారణమైన కంపెనీలలో ప్రధానంగా వేదాంతా గ్రూప్, జొమాటో, అదానీ ఎనర్జీ, వరుణ్‌ బెవరేజెస్‌ తదితరాలను ప్రస్తావించవచ్చు. వేదాంతా, జొమాటో విడిగా రూ. 8,500 కోట్లు చొప్పున అందుకున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)