Breaking News

సోదరుడికి పంపిన లీగల్‌ నోటీసు విత్‌డ్రా

Published on Tue, 08/12/2025 - 12:14

సన్ టీవీ నెట్‌వర్క్‌ లిమిటెడ్ ఛైర్మన్ కళానిధి మారన్ ఆయన సోదరుడు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మధ్య తలెత్తిన న్యాయ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు కంపెనీ తెలిపింది. కళానిధి మారన్‌కు వ్యతిరేకంగా దయానిధి జారీ చేసిన అన్ని లీగల్ నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

సన్‌టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్‌తోపాటు మరో ఏడుగురిపై గతంలో ఆయన సోదరుడు దయానిధి మారన్‌ లీగల్‌ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్‌ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్‌ భార్య కావేరి మారన్‌కు కూడా నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో దయానిధి మారన్‌ లీగల్‌ నోటీసులు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది.

కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో  సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌

  •    సన్ టీవీ నెట్‌వర్క్‌ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది.

  •    సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ.

  •    సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్‌) శాటిలైట్ టీవీ సర్వీస్.

  •    సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.

  •    కేఏఎల్‌ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది.

  •    కేఏఎల్‌ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌.

  •    కేఏఎల్‌ రేడియో / సౌత్‌ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.

ప్రింట్ మీడియా

  •    దినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.

క్రీడలు

  •    సన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ.

  •    సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.

ఇదీ చదవండి: కొత్త ఆదాయపన్ను బిల్లులోని ముఖ్యాంశాలు

గతంలోని వెంచర్

  •    స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్‌ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)