Breaking News

దానివల్లే ఇస్రో ఉద్యోగాలను వద్దనుకుంటున్నారు.. చైర్మన్‌ కామెంట్స్‌ వైరల్‌

Published on Thu, 10/12/2023 - 15:15

భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెబుతున్న 'ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్' (ISRO)లో పనిచేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆధునిక కాలంలో అలాంటి వారి సంఖ్య బాగా తగ్గిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ 'ఎస్ సోమనాథ్' (S Somanath) తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఈయన అలా ఎందుకన్నారు? కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల నుంచి బయటకు వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరటానికి సుముఖత చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం జీతభత్యాలే అంటూ సోమనాథ్ తెలిపారు.

దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులు ఇంజినీర్లుగా, ఐఐటీయన్లుగా ఉండాలి. వారు తప్పకుండా దేశ ప్రతిష్టను పెంచే ఇస్రోలో చేరాలి. కానీ నేడు అలా జరగడం లేదు. రిక్రూట్‌మెంట్స్ ప్రకటించినప్పటికీ ఎక్కువ మంది దీని కోసం ప్రయత్నించడం లేదు. కొందరు పనిచేసే స్థలం ముఖ్యమని భావించి చేరుతున్నారు, అలాంటి వారు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు.

60 శాతం మంది
ఇస్రో చీఫ్ ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి ఇటీవల టీమ్ బయలుదేరింది. అయితే చాలామంది ఉద్యోగం కోసం వచ్చిన వారు శాలరీ స్ట్రక్చర్ చూసి ప్రెజెంటేషన్‌ నుంచి 60 శాతం మంది బయటకు వెళ్లిపోయారని సోమనాథ్‌ తెలిపారు.

గతంలో కొందరు ఇస్రోలో జీతాలు భారీగా ఉంటాయని భావించే వారు, కానీ గత నెలలో హర్ష్ గోయెంకా ఒక ట్వీట్‌లో సోమనాథ్ జీతం రూ. 2.5 లక్షలని, వేర్వేరు పోస్టులకు వేరువేరు వేతనం ఉంటుందని, అయితే ఇక్కడ ఇంజనీర్ల ప్రారంభ వేతనం దాదాపు రూ. 56,100 మాత్రమే అని తెలిపాడు.

ఇదీ చదవండి: నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు!

ప్రస్తుతం ఐఐటీ చేసిన చాలామంది ఎక్కువ ప్యాకేజి కోసం చూస్తున్నారు, ఈ కారణంగా ఇస్రోలో చేరటానికి ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అయితే దేశంపై ఉన్న ప్రేమతో ఇక్కడ చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి 'సమృద్ జోషి' వెల్లడించాడు. కానీ టెక్నాలజీలో దూసుకెళుతున్న భారతదేశం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్తమ ప్రతిభ ఉన్నవారు ముందుకు రావాలి. అందరూ శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తే రానున్న రోజులు ప్రశార్థకంగా మారుతాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)